SKLM: జిల్లాలో ఈ నెల 14నుంచి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈపీడీసీఎల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణ మూర్తి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రం, డివిజన్ల పరిధిలో ర్యాలీలు, పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నామని తెలిపారు. 20న ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.