SKLM: రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా గురువారం రాత్రి పోలీసులు ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాలు, చెక్ పోస్టుల వద్ద వాహనదారుల పై మద్యం పరీక్షలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటించాలని పోలీసులు సూచించారు.