NTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం నూతన ఛైర్మన్గా పీ. త్రివిక్రమ్ రావు గురువారం స్థానిక పున్నమి ఘాట్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అధికార భాషా సంఘం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాష ఔన్నత్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని తెలియజేసే సారథిగా, వారధిగా పనిచేస్తుందని మండలి వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన తెలిపారు.