VSP: భీమిలి పరిధిలోని మధురవాడ హిల్-4లో సత్వా వాంటేజ్ వైజాగ్ క్యాంపస్‌కు మంత్రి నారా లోకేష్ ఇవాళ శంకుస్థాపన చేస్తారు. 30 ఎకరాల్లో రూ.1,500 కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా 25 వేల ప్రత్యక్ష, 40-50 వేల పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ క్యాంపస్ తీర ప్రాంతంలో అతిపెద్ద భవిష్యత్ ఉపాధి కేంద్రంగా నిలవనుంది.