AP: తిరుమలలో 2015-25 మధ్య జరిగిన పట్టువస్త్రం స్కాంపై Dy.CM పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘TTDలో ఎన్నో అక్రమాలు జరగుతున్నాయి. వాటిని విచారించాలని అధికారులను ఆదేశించాం. అందుకే వరుసగా స్కాంలు బయటపడుతున్నాయి. హిందూ మతం అంటే అందరికీ చిన్న విషయంగా కనిపిస్తోంది. పరకామణి విషయంలో జగన్ వ్యాఖ్యలు సరికాదు. జగన్ మతంలో కూడా ఇలాగే జరిగితే చిన్న విషయం అని కొట్టిపడేసేవారా?’ అని అన్నారు.