KMR: తాను ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని సర్పంచ్ అభ్యర్థి నవాబ్ సుదర్శన్ గౌడ్ అన్నారు. పిట్లం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి రాజీనామా బాండ్ పేపర్‌ను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. “నా పదవీకాలం సగం అంటే 2.5 ఏళ్లు పూర్తయ్యేలోగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైతే.. వెంబటినే రాజీనామా చేస్తా అన్నారు.