KMR: బాన్సువాడ మండలం తాడ్కోల్ సబ్ సెంటర్ను జిల్లా NCD ప్రోగ్రాం అధికారి సోమవారం సందర్శించారు. సబ్ సెంటర్ ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తుల గుర్తింపు ప్రక్రియపై సిబ్బందిని ప్రశ్నించారు. అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.