NZB: వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలో జరుగుతున్న సంత మల్లన్న జాతర ఉత్సవాల్లో సోమవారం రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. సంతమల్లన్న జాతర సందర్బంగా ఆ మల్లన్న స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. జాతరలో ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు.