NLG: వ్యక్తులు శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు, మనం చేసే అభివృద్దే శాశ్వతమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత తనదని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా చండూరు మండలంలోని గ్రామాలలో సోమవారం పర్యటించి కాంగ్రెస్, మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.