JGL: రాయికల్ మండలం వీరాపూర్ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. రాయికల్ మండలం వీరాపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవమయింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి వారిని శాలువాతో సత్కరించారు. ఏకగ్రీవ సర్పంచ్ దిండిగాల గంగు – రామస్వామి గౌడ్, ఉప సర్పంచ్ నర్సిరెడ్డి, వార్డు సభ్యులను శాలువాతో సత్కరించి అభినందించారు.