GDWL: పీడీఎస్యూ గద్వాల్ జిల్లా 4వ మహాసభ గద్వాల్ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు మాట్లాడుతూ .. నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాడుదాం అని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. ఈ విధానం పేరుతో నిరుపేద విద్యార్థులను విద్యకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారని ఆరోపించారు.