MDK: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు సూచించారు. ఇవాళ మెదక్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమానికి విచ్చేసిన బాధితుల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం చేయాలని సూచించారు.