అల్జీమర్స్‌కు సంబంధించిన మెదడు పనితీరును అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు సూపర్ కంప్యూటర్ సాయంతో ఒక వర్చువల్ ఎలుక మెదడును తయారు చేశారు. అమెరికా, జపాన్ నిపుణులు సంయుక్తంగా రూపొందించిన ఈ డిజిటల్ మెదడులో 9 మిలియన్ల న్యూరాన్లు, 26 బిలియన్ల సినాప్సెస్ ఉన్నాయి. ఎలుక, మానవ మెదడు దగ్గర పోలికలు ఉండటంతో అల్జీమర్స్ పరిశోధనకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.