TG: కొత్త రాష్ట్రమైన తెలంగాణ.. అభివృద్ధిలో దూసుకుపోతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలని సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో మాట్లాడిన ఆయన.. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల నుంచి ఆలోచనలు, అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నామన్నారు.