TG: రాష్ట్ర ప్రభుత్వ విజన్లో భాగస్వాములయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని సీఐఐ మాజీ ఛైర్మన్ దినేష్ అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొన్న దినేష్.. తెలంగాణ ఇప్పటికే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలను ఒకే వేదికపైకి రప్పించడం గొప్ప విషయమని చెప్పారు.