VSP: భీమిలి జోన్లో డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలపై అవగాహన కల్పించేందుకు భద్రం ఫౌండేషన్ కళాకారులు వినూత్న వీధి నాటికలు సోమవారం ప్రదర్శించారు. దోమల వ్యాప్తి, జ్వరాల ప్రమాదం, ప్రజల నిర్లక్ష్యం వల్ల వచ్చే సమస్యలను చక్కగా వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు. నీరు నిల్వ ఉండకుండా డ్రైడే పాటించడం, పరిశుభ్రత పాటించడం వంటి సూచనలు నాటికలో వివరించారు.