ELR: తమ సమస్యల పరిష్కారం కోరుతూ PACS రాష్ట్ర ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముదినేపల్లి KDCC బ్యాంకు వద్ద సోమవారం ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఆ సంఘం జిల్లా కార్యదర్శి పళ్లెం శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రతి ఐదేళ్లకు వేతన సవరణ చేయాల్సి ఉందన్నారు. కానీ 2019, 2024 వేతనసవరణ పెండింగ్లో ఉన్న కారణంగా వాటిని సవరించి మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.