NLR: వరికుంటపాడు మండలం కనియంపాడుకు చెందిన వ్యక్తి పామూరులోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన వెంగబాబు జీవనోపాధి కోసం బెంగళూరుకు వెళ్లాడు. అక్కడే నివాసం ఉంటున్నాడు. ఏమైందో ఏమో పామూరుకు వచ్చాడు. ఇక్కడ ఓ లాడ్జిలో రూము తీసుకుని ఉరేసుకున్నాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో బోరున విలపించారు.