MDCL: మచ్చ బొల్లారం డివిజన్లోని లక్ష్మీ ఎన్క్లేవ్ ఫేజ్-2లో రూ.25 లక్షల వ్యయంతో చేపడుతున్న CC రోడ్ పనులకు నేడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రోడ్ పూర్తయిన తర్వాత స్థానికుల రాకపోకలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు. ప్రజలు కోరిన అభివృద్ధి పనులను దశల వారీగా అమలు చేస్తున్నామని, డివిజన్లో మిగతా పనులను కూడా పూర్తి చేస్తామన్నారు.