కస్టమ్స్ సుంకాల సరళీకరణ చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తర్వాత చేపట్టే భారీ సంస్కరణ అదేనని చెప్పారు. ఈ విధానాన్ని మరింత పారదర్శకంగా రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జీఎస్టీలో భారీ మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.