BDK: ఆర్టీసీ కార్మికులు సమస్యలు పరిష్కరించాలనీ, గత 15 రోజులుగా వారి న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలనీ మణుగూరు RTC డిపో ముందు రిలే దీక్ష చేస్తున్నారు. శనివారం ఉదయం దీక్షా శిబిరంను సీపీఐ మణుగూరు పట్టణ కార్యదర్శి దుర్గ్యాల సుధాకర్, ఏఐటీయూసీ మణుగూరు మండల అధ్యక్షులు రాయల భిక్షంలు సందర్శించి వారికి మద్దతు ప్రకటించారు.