విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ చొరవతో, వేదాంత కంపెనీ సహాయంతో శనివారం జగదాంబలోని అంబికా బాగ్ వద్ద 75మంది పేద మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా స్వయం ప్రతిపత్తి సాధించేందుకు ఈ చర్య చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.