కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. కారులో మంటలు వ్యాపించి పోలీస్ ఇన్స్పెక్టర్ సజీవ దహనం అయ్యారు. గదగ్ లోకాయుక్త ఎస్పీ కార్యాలయంలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న పంచాక్షరయ్య ఓ వివాహ వేడుకకు హాజరై కారులో తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి పక్కన ఉన్న వంతెనను కారు ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు వ్యాపించి ఆయన మరణించారు.