KMM: పోలీసుశాఖలో హోంగార్డుల సేవలు కీలకమని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ హెడ్ కోటర్స్లో శనివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో అత్యంత ప్రతిభ చూపిన హోంగార్డులకు ప్రశంస పత్రాలు అందజేశారు. నిత్యం క్రమశిక్షణతో మెలుగుతూ పోలీసుల ప్రతిష్టను పెంచేలా విధులు నిర్వర్తించాలన్నారు.