MBNR: జడ్చర్ల మండలంలోని దేవుని గుట్ట గ్రామ పంచాయతీ శుక్రవారం ఏకగ్రీవం అయింది. కాంగ్రెస్ మద్దతుదారు కవిత కిషన్ నాయక్ ఇతర పార్టీల నుంచి పోటీ లేకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే, 8 మంది వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కొత్తగా ఎంపికైన సర్పంచ్, వార్డు సభ్యులకు అభినందనలు తెలిపారు.