వందలాది ఇండిగో విమాన సర్వీసులు రద్దవడంపై కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు స్పందించారు. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. గత రెండు రోజులతో పోలిస్తే.. పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు పేర్కొన్నారు.