KMM: పంచాయతీ ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీ చరణ్ సుదామా రావు అన్నారు. రఘునాథపాలెం మండల ఎంపీడీవో కార్యాలయాన్ని, పోలింగ్ కేంద్రాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.