కోనసీమ: ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో బేతెస్థా ప్రార్థన మందిరంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిసెంబర్ మొదటి శుక్రవారం క్రిస్మస్ పర్వదినాలు, వేడుకలు బేతెస్థాలో నిర్వహించుకోవడం సంతోషదాయకమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రపంచానికి ఏసు ప్రభువు ప్రేమ మార్గం చూపారన్నారు.