VSP: మధురవాడ సర్వీస్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ నిత్యకృత్యమైంది. శుక్రవారం ఉదయం డి-మార్ట్ దగ్గర ప్రారంభమైన రద్దీ మొత్తం సర్వీస్ రోడ్డు పొడవునా వ్యాపించింది. విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పీఎం పాలెం ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ చేస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాని నగరవాసులు కోరుతున్నారు.