VZM: గంట్యాడ మండలంలోని కోటారబిల్లి జంక్షన్లో గల అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ విమల రాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రం భవన పరిసరాలు పరిశీలించడంతో పాటు పలు రికార్డులను తనిఖీ చేశారు. అలాగే ఆహార పదార్థాలు రుచి చూశారు. అంగన్వాడీ సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో ఉమాభారతి, సిబ్బంది పాల్గొన్నారు.