ఫైనాన్షియల్ ఇష్యూల వల్ల ‘అఖండ 2’ విడుదల వాయిదా పడింది. అయితే ఇటీవల రిలీజైన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’లో ఇలాంటి సన్నివేశం జరిగింది. ఆ సినిమాలో హీరో రూ.3 కోట్లు చెల్లించలేక తన సినిమా ఆగిపోతే.. అతని అభిమాని ఆ డబ్బును చెల్లిస్తాడు. ఇప్పుడు నిజ జీవితంలో ఫైనాన్షియల్ ఇష్యూ కారణంగా ‘అఖండ 2’ వాయిదా పడింది. దీంతో నెటిజన్లు సినిమాలో జరిగిందే నిజంగా జరిగిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.