ఉక్రెయిన్ విషయంలో భారత్ మొదటి నుంచి శాంతి పక్షాన ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై భారత్, రష్యా సుదీర్ఘకాలంగా పోరాడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ వేదికలపై ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. అలాగే, రష్యా పర్యాటకులకు వీసా నిబంధనలలో వెసులుబాటు కల్పించినట్లు మోదీ తెలిపారు.