SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు నామినేషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడో ఫేజ్లో భాగంగా ఎల్లారెడ్డిపేట, హరిదాస్ నగర్, వెంకటాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిశీలనలో వేములవాడ, ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ సుజాత తదితరులున్నారు.