J.N: రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో శుక్రవారం బోరు పనుల సమయంలో 11 కెవి లైన్ బోరు బండి వాహనాన్ని తాకడంతో విద్యుత్ షాక్ తగిలి రామ్ సింగ్(22) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు వెంటనే 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. మృతుడు చత్తీస్ఘడ్ చెందినవాడిగా పోలీసులు గుర్తించినట్లు తెలిపారు.