NLG: కనంగల్ మండలం ఇస్లాంనగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గ్రామానికి చెందిన సాప్ట్వేర్ ఉద్యోగిని బోయపల్లి అనూష పోటీ చేస్తున్నారు. అనూష తండ్రి జానయ్య గతంలో ఉమ్మడి చర్ల గౌరారం ఎంపీటీసీగా పనిచేశారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తన వద్ద ప్రణాళికలు ఉన్నాయని అనూష తెలిపారు.