CTR: ఐరాల మండలం గుడిపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున గోడ కూలిపోవడంతో ముని కృష్ణారెడ్డికి చెందిన మూడు పాడి ఆవులు అక్కడికక్కడే మృతిచెందాయి. ఆకస్మికంగా జరిగిన ఈ ఘటన రైతును తీవ్ర ఆవేదనకు గురిచేసింది. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని, జీవనాధారం కోల్పోయిన తనకు ప్రభుత్వం తక్షణం సహాయం అందించాలని ఆయన కోరారు.