ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్థానిక DLTC ప్రధానాచార్యుడు భూషణం శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాశ్ యోజన క్రింద ఫిల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ & పెరిఫెరల్స్ కోర్స్ లో మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇంటర్ లేక అంత కంటే ఎక్కువ ఉత్తీర్ణులైన వారు 15 – 35 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు.