TG: ఐబొమ్మ రవికి పోలీసులు జాబ్ ఆఫర్ చేశారు అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. విచారణ సమయంలో రవికి జాబ్ ఆఫర్ చేయగా సున్నితంగా తిరస్కరించాడని ప్రచారం జరిగింది. కాగా, ఈ వార్తలపై సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు స్పందించారు. రవికి జాబ్ ఆఫర్ చేశామని చెప్పడం అవాస్తవం అని కొట్టిపారేశారు. ఎనిమిది రోజుల కస్టడీలో రవి కొన్నింటికి మాత్రమే సమాధానం ఇచ్చాడని వెల్లడించారు.