సిరిసిల్ల: సిరిసిల్ల మానేరు వాగులో గుర్తు తెలియని మృతదేహం శుక్రవారం లభ్యమయింది. అటుగా వెళుతున్న వాహనదారులు మృతదేహాన్ని చూసి ఫొటోలు, వీడియోలు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు. మృతదేహానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.