ATP: రాయదుర్గం పట్టణానికి చెందిన ఇద్దరు పేదింటి యువకులు అగ్నివీర్లో సైనిక ఉద్యోగాలు పొందారు. పట్టణంలోని కోతిగుట్ట ఏరియాకు చెందిన కారు డ్రైవర్ కసందుల వెంకటేశ్ కుమారుడు పణికుమార్ పంజాబ్ రిజమెంటులో, అలాగే కణేకల్లు రోడ్డులో ఉన్న ఆటో డ్రైవర్ అనిల్ సింగ్ కుమారుడు మహేశ్ సింగ్ శ్రీనగర్ రిజమెంటులో ఇటీవల జరిగిన సెలక్షన్లో సైనిక ఉద్యోగాలు సాధించారు.