HYD: చదువుల ఒత్తిడి తట్టుకోలేక హైదరాబాద్లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కుషాయిగూడ HB కాలనీకి చెందిన సిద్ధార్థ(18) ఇంటర్ పూర్తి చేసి, IIT కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ‘ఈ ఒత్తిడి నావల్ల కాదు, జీవితంపై విరక్తి చెందా’ అంటూ ఉరేసుకున్నాడు. బయటకు వెళ్లొచ్చిన తల్లిదండ్రులు కొడుకు బలవన్మరణానికి పాల్పడటం చూసి కన్నీరుమున్నీరవుతున్నారు.