విజయనగరం కోరుకొండ రైల్వే స్టేషన్ పట్టాల మధ్య గుర్తు తెలియని మహిళ మృతదేహం( ఒడిస్సా)గుర్తించినట్లు జీఆర్పీ ఎస్సై బాలాజీరావు శుక్రవారం తెలిపారు. మృతురాలు వయస్సు 50,55 మధ్య ఉంటుందన్నారు. 5అడుగుల 3అంగుళాలు పొడవు ఉంటుందన్నారు. ఎరుపు రంగు ఉండి,పసుపు రంగుపై ఎరుపు తెల్లటి చారల చీర ఎర్రటి జాకెట్ ధరించినట్లు పేర్కొన్నారు. వివరాలకు 9490617089 సంప్రదించాలన్నారు.