KMM: సింగరేణి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ రెండో రోజు మరింత జోరుగా కొనసాగింది. ఉదయం 10 గంటలు మొదలుకొని అభ్యర్థులు సాయంత్రం 5 గంటలు సమీపిస్తున్న నామినేషన్ సమర్పించేందుకు అభ్యర్థుల రద్దీ తగ్గలేదు. రెండో రోజుకు సర్పంచ్ స్థానానికి 77 నామినేషన్లు, వార్డులకు 215 నామినేషన్లు వచ్చినట్లు ఎంపీడీవో శ్రీనివాసరావు గారు తెలిపారు.