SAతో 2వ ODIలోనూ కోహ్లీ సెంచరీ చేస్తాడని అనుకోలేదని సునీల్ గవాస్కర్ అన్నాడు. కానీ ఆరంభంలోనే కోహ్లీ కొట్టిన సిక్సర్‌తో మంచి ఇన్నింగ్స్ ఆడతాడని భావించానని పేర్కొన్నాడు. రాంచీలో చేసిన సెంచరీ కోహ్లీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందన్నాడు. ఇక రుతురాజ్‌తో కోహ్లీ మాట్లాడిన తర్వాత అతని ఆట మారిందని, యువ ఆటగాడిని ఓ సీనియర్ నడిపించిన తీరు చూసి ముచ్చటేసిందని పేర్కొన్నాడు.