SKLM: కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పి. శిమ్మయ్య, ఎస్. రమణ వ్యక్తులు పట్టుబడ్డారు. ఈ మేరకు వీరిని పోలీసులు కోర్టులో హాజరు పరచగా ఇద్దరికి కోర్టు మెజిస్ట్రేట్ కె. రాణి ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించినట్లు గురువారం ఎస్సై వెంకటేష్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై హెచ్చరించారు.