BPT: చిన్నగంజాం మండల పరిధిలోని మసీదు పేటలో ఉన్న స్మశానం వద్ద రహస్యంగా పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు వచ్చిన సమాచారం మేరకు గురువారం దాడులు నిర్వహించినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. పేకాట ఆడుతున్న వ్యక్తుల నుంచి రూ. 3,200ల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.