BPT: అద్దంకి డిపో మేనేజర్‌గా బెల్లంకొండ రామ్మోహన్ రావు గురువారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఈయన గతంలో ఇక్కడే డిపో మేనేజర్‌గా పనిచేసి బదిలీపై వెళ్లారు. అయితే, బదిలీపై వెళ్లిన కొన్ని నెలల్లోనే మళ్లీ అద్దంకికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ బలోపేతానికి కృషి చేసి, ప్రయాణికుల సమస్యలపై దృష్టి సారిస్తానని చెప్పారు.