గుంటూరు జీజీహెచ్లో గుర్తుతెలియని 40 ఏళ్ల ట్రాన్స్జెండర్ చికిత్స పొందుతూ మరణించారు. మృతదేహాన్ని మార్చూరీలో ఉంచినట్లు కొత్తపేట పోలీసులు తెలిపారు. గత నెల 27న క్యాజువాల్టీ వద్ద అపస్మారకంగా దొరకగా చికిత్స పొందుతూ మరణించారని పేర్కొన్నారు. వివరాలు తెలిసిన వారు కొత్తపేట పోలీసులను సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.