GDWL: గద్వాల జిల్లాలోని అలంపూర్, ఇటిక్యాల, మానవపాడు, ఉండవెల్లి, ఎర్రవల్లి మండలాల్లో మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 75 సర్పంచ్ స్థానాలకు గాను, రెండో రోజు గురువారం నాటికి 123 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 700 వార్డు స్థానాలకు 344 నామినేషన్లు వచ్చాయి అని అదికారులు తెలిపారు. నామినేషన్లు సమర్పించడానికి రేపటి వరకు అవకాశం ఉంది.