ELR: జంగారెడ్డిగూడెం రోడ్డును నాలుగులైన్ల జాతీయ రహదారిగా మార్చేందుకు ఎంపీ ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఉంగుటూరులో జరిగిన సీఎం సభలో ఎంపీ మహేష్ కుమార్ ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఆదిశగా ఢిల్లీలో తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గురువారం కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీను స్వయంగా కలిసిన ఎంపీ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.